Heart Attack and Sleep: నిద్ర తగ్గితే హార్ట్ ఎటాక్ వస్తుందా?

Heart attack and sleep deprivation

మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా నిద్ర లేమి సమస్య ఎక్కువగా వస్తుంది. మనిషికి తిండి, నీళ్లు ఎలాగో నిద్ర కూడా అంతే. ఈ మూడు లేకుండా మనిషి ఉండలేడు. మనిషి సగటున 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి.

How your sleep affects your heart ?
నిద్ర తగ్గితే

ఈ రోజుల్లో ఎక్కువ మంది ఆరు గంటల కన్నా తక్కువగా నిద్రపోతున్నారు. రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మనం చాలా ప్రమాదకరమైన గుండె జబ్బుల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారిలో గుండెపోటు, స్ట్రోక్, కరోనరీ ఆర్టరీ డిసీస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

నిద్ర తగ్గితే వచ్చే ఆరోగ్య సమస్యలు

ఈ నిద్రలేమి కారణంగా అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. అధిక రక్తపోటు గుండె జబ్బులకు ప్రధాన కారణం. ఈ అధిక రక్తపోటు కారణంగా గుండెపై కలిగే అధిక ఒత్తిడి ధమనుల ఆరోగ్యానికి నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే నిద్రలేమి కారణంగా ధమనులు గట్టిపడతాయి. రక్తప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది.

గుండెలో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది..అలాగే గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వస్తాయి. దీనివల్ల హార్ట్ ఎటాక్ వస్తుంది.. ఈ మధ్య కాలంలో హార్ట్ ఎటాక్ ఎక్కువగా వస్తుంది.

ఒత్తిడి, ఆందోళన కూడా పెరుగుతాయి

నిద్రలేమి కారణంగా మన శరీరం యొక్క బరువు విపరీతంగా పెరుగుతుంది. ఇది క్రమంగా ఊబకాయానికి దారి తీస్తుంది. ఊబకాయానికి గుండె సమస్యలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. నిద్రలేమి ఇలా పరోక్షంగా కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే నిద్రలేమి కారణంగా శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దాంతో శరీరంలో చక్కర స్థాయిలు పెరిగి మధుమేహం బారిన పడే అవకాశం ఉంది. అలాగే నిద్రలేమి కారణంగా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

రోజూకి ఆరు గంటల నిద్ర తప్పనిసరి

ఈ విధంగా నిద్రలేమి మన గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని గుండె సంబంధిత సమస్యలు తలెత్తిన తరువాత బాధపడడం కంటే ముందుగానే జాగ్రత్త తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. అందుకని రోజుకు ఆరు గంటలు తప్పక నిద్రపోవాలి.

Disclaimer: నిపుణులను సంప్రదించి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు doctorsinside.com బాధ్యత వహించదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top