గర్భిణీలలో అధిక రక్తపోటుని అదుపు చేయడం సాధ్యమేనా?
మామూలు రక్తపోటు కంటే గర్భిణీల రక్తపోటు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. మరీ ముఖ్యంగా 20 వారాలు దాటిన తరువాత రక్తపోటులో మార్పు మితిమీరి ఉంటే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమరుపాటుగా ఉంటే గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల వంటి కీలకమైన అవయవాలు దెబ్బతిని ప్రాణాంతకంగా మారవచ్చు.