Facial Hair: ముఖంపై వెంట్రుకలా… ఈ ఫేస్ ప్యాక్ టిప్స్ మీకోసమే..!

How to remove facial hair in women

అవాంఛిత రోమాల వల్ల ముఖం అంద విహీనంగా కనబడుతుంది. అయితే చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి లేజర్ చికిత్సను ఆశ్రయిస్తారు.

facial hair tips

లేజర్ చికిత్స (Laser Treatment)

లేజర్ చికిత్స వల్ల ఫలితం ఉన్నప్పటికి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే లేజర్ ట్రీట్ మెంట్ కు బదులుగా మనకు సులభంగా లభించే కొన్ని పదార్థాలతో ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని వాడడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అంతేకాకుండా చర్మానికి కూడా హాని కలగకుండా ఉంటుంది.

టిప్: ఫేస్ ప్యాక్ విత్ ఓట్స్ (Oats)

అవాంఛిత రోమాల సమస్యతో బాధపడే వారు ఓట్స్ ను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ పొడిని తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో అరటిపండు వేసి అంతా కలిసేలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తరువాత మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల పాటు బాగా మర్దనా చేసుకోవాలి. ఇది ఆరిన తరువాత ముఖం బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు ఈజీగా తొలగిపోతాయి. అలాగే చర్మంపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు కూడా తొలగిపోతాయి.

టిప్: ఫేస్ ప్యాక్ విత్ కోడిగుడ్డు తెల్లసొన (Egg)

అలాగే ఒక గిన్నెలో కోడిగుడ్డును తెల్లసొనను తీసుకోవాలి. తరువాత ఇందులో తగినంత బియ్యం పిండి వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఒక 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సమస్య ఈజీగా తొలగిపోతుంది.

టిప్: ఫేస్ ప్యాక్ విత్ బొప్పాయి (Pappaya)

అవాంఛిత రోమాలను తొలగించడంలో బొప్పాయి పండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ అవాంఛిత రోమా లకుదుళ్లను విచ్చినం చేసి వాటి పెరుగుదలను ఆరికడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో బొప్పాయి పండు గుజ్జును తీసుకుని అందులో కొద్దిగా పసుపును వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తరువాత ఈ పేస్ట్ ను ముఖానికి రాసుకుని 15 నుండి 20 నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాల సమస్య ఈజీగా తగ్గుతుంది.

టిప్: ఫేస్ ప్యాక్ విత్ నిమ్మరసం (Lemon Juice)

ఒక గిన్నెలో నిమ్మరసాన్ని ఇంకా పంచదారను తీసుకుని వేసి 3 నిమిషాల పాటు వేడి చేయాలి. ఆ తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి వ్యాక్స్ లాగా అయ్యే వరకు వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అయితే ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే అవాంచిత రోమాలపై రాసుకోవాలి. ఆ తరువాత దీనిపై వ్యాక్స్ పేపర్ ను ఉంచి గట్టిగా వత్తాలి.ఇక తరువాత ఈ వ్యాక్స్ పేపర్ ను వ్యతిరేక దిశలో గట్టిగా లాగాలి. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా అవాంఛిత రోమాల నుండి బయట పడవచ్చు.

అవాంఛిత రోమాల సమస్యతో బాధపడే వారు ఈ ఫేస్ ప్యాక్ లను వాడడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

గమనిక: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ ను రూపొందించడం జరిగింది. ఈ టిప్స్ ఫాలో అయ్యే ముందు నిపుణులను సంప్రదించి వారి సలహా తీసుకోవలసిందిగా మనవి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top