కాబోయే తల్లి ఆ తన్నులు తినకపోతే అనుమానించాలా?

Fetal Movements

కడుపుతో ఉన్నవారు లోపల వారి బిడ్డ కదలికలకు ఎప్పుడూ సంతోషపడుతూ ఉంటారు. శిశువు కదలికలు ఎక్కువగా 18 వారాలప్పుడు లేదా 24 వారాలప్పుడు జరుగుతూ ఉంటుంది. శిశువు కడుపులో కాస్త తన్నుతున్నప్పుడు సాధారణంగా గర్భిణీకి ఆనందం కలుగుతుంది. అయితే కడుపులో ఎలాంటి కదలికలు లేకుంటే మాత్రం కాస్త ఆందోళనకర విషయమే.

గర్భిణిలో నెలలు గడిచే కొద్దీ శిశువు కదలికలు ఎలా ఉంటాయి ?

కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటే రెండు గంటల్లో ఒక్కోసారి పది సార్లు తన్నే అవకాశం ఉంటుంది. అందువల్ల గర్భంలో బిడ్డ కదిలికలు సరిగ్గా లేకుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలాంటి పరిస్థితిని గుర్తించటమెలా అనే విషయం మీద అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.

నెలలు నిండుతున్న కొద్దీ గర్బంలో బిడ్డ కదలికలు కాబోయే మాతృమూర్తికి స్పష్టంగానే తెలుస్తాయి. ఆయాసంగా ఉన్నా, ఏదైనా అసౌకర్యంగా అనిపించినా గర్భవతి తన చేతితో పొట్టపై రాసుకునేటప్పుడు ఆమె చెయ్యి ఎటువెళితే గర్భంలోని బిడ్డ అటు కదులుతున్నట్టుగా అనుభూతి కదులుతుంది. అంతేకాదు గర్భస్థ శిశువు పొట్టలో కదులుతూ తన లేత కాళ్ళతో తనను తన్నుతున్నట్టు అనిపిస్తుంటుంది.

ఏడు నెలల గర్భధారణ సమయంలో శిశువు సాధారణంగా ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటుంది. శిశువు దాదాపు గంటకు 50 సార్లు కదులుతూ ఉంటే, 95% మగత నిద్రలో ఉంటుంది. ఇది రోజువారీ మారుతూ ఉండవచ్చు, కానీ శిశువుకు జన్మనిచ్చే సమయానికి కదలికలు చాలా ఊహాజనితంగా ఉంటాయి. కొంతమంది శిశువులు రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారు.

ఏ సమయంలో ఏ నెలలో కదలికలను గమనించవచ్చు?

గర్భిణులు రాత్రి సమయంలో కదలికలను బాగా గమనించగలరు కానీ పగటి సమయంలో ఎక్కువగా గమనించలేరు. నెలలు గడవక ముందు, లేదా  స్ధిరంగా ఉన్నపుడు కదలికలను అనుభవించలేరు. కొన్నిసార్లు   శిశువు ఎక్కిళ్ల రూపంలో చేసే చిన్ని కదలికలు  గమనించలేకపోవచ్చు, ఎందుకంటే గర్భిణి మొదట్లో కంగారుగా ఉండటం వల్ల. కానీ శిశువు కదలికలు తీవ్రంగా ఉన్నపుడు లేదా శిశువు  గట్టిగా తన్నినపుడు మాత్రం కదలికలను గమనిస్తారు.

శిశువు రాత్రివేళల్లో  ఎక్కువ చలాకీగా ఎందుకు కనిపిస్తుందో వివరించడానికి ఒక కారణం ఉంది. ఏమిటంటే ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అంటే ఆ సమయంలో ఎటువంటి పనీ చేయకుండా ఉండడం లేదా ఎటువంటి కదలికా లేకపోవడం వల్ల. పగటిపూట గర్భిణి అటూ ఇటూ కదులుతూ ఉండటం వల్ల శిశువు దాదాపు నిద్రకు ఉపక్రమిస్తుంది. గర్భిణి పడుకున్నపుడు కదలికలు ఆగిపోతాయి. శిశువు తన చుట్టూ ఏమి జరుగుతుందా అని అటూ ఇటూ తిరగడం ప్రారంభిస్తుంది.

అదే కాకుండా, ఏడు నెలల గర్భధారణ సమయంలో శిశువు శబ్దాలను గ్రహించడం ప్రారంభిస్తుంది, ప్రాధాన్యతలు చూపించడం ప్రారంభిస్తుంది. తల్లి గొంతును గుర్తించగలుగుతుంది. చుట్టుపక్కల కొత్త గొంతును వింటే, శిశువు మరింత ఉత్సాహంగా ఉంటుంది. మరోవైపు, సమయం కాని సమయంలో మీరు ఏమి తింటున్నారు అనేది కూడా శిశువు గమనించగలదు.

గర్భంలో శిశువు కదలికలు ఎలా అనిపిస్తాయి?

గర్భస్థ శిశువు పొట్టలో కదులుతూ తన లేత కాళ్ళతో తమను తన్నుతున్నట్టు అనిపించినా  తల్లులు ఆనందంతో పులకరించిపోతారు. అటువంటి అనుభూతుల వల్ల బిడ్డ ఇంకా పుట్టకపోయినా అప్పుడే తల్లి అయినట్లు అనిపించి పుట్టబోయే బిడ్డలపై తల్లులకు అమితమైన మమకారం ఏర్పడుతుంది. ఇంకా పుట్టకుండానే బిడ్డకు తల్లితో అనుబంధం ఏర్పడుతుంది.

మహిళలు గర్భిణీలుగా ఉన్నప్పుడు

  • హార్మోన్లలో మార్పులు రావటం
  • బరువు పెరగటం
  • ఒంటికి నిగారింపు కలగటం

ఎంత సహజమో పుట్టకముందు నుంచే బిడ్డలో అనుబంధం ఏర్పడటం అంత సహజం. 

శిశువుకు జ్ఞాపకశక్తి గర్భంలో ఉండగానే వృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి అప్పటి అనుభూతులు లీలగా జ్ఞాపకంగా ఉంటూ తల్లితో జీవితాంతం ఉండే మాతృబంధానికి పునాదిగా భాసిస్తూ ఉంటాయి. మహిళలు గర్భం ధరించిన అయిదు లేక ఆరు నెలల తర్వాత గర్భస్థ శిశువుకు వినికిడి శక్తి పెరుగుతుంటుంది. ఆ సమయంలో వారు తల్లి గుండె చప్పడునే కాక ఆమె మాటలను కూడా వినగలుగుతారు.

తల్లి గుండె చప్పుడుతో పాటు తల్లి మాటలు కూడా తరచుగా వినడం వల్ల ఆమె కంఠస్వరంతో పుట్టకముందు నుంచే పరిచయం ఏర్పడుతుంది.

అంతేగాకుండా ఆ కంఠస్వరం అంటే మక్కువ కూడా ఏర్పడుతుంది. పుట్టిన తర్వాత తల్లి బిడ్డను ఒడిలోకి తీసుకుని పలకరించినప్పుడు ఆ కంఠస్వరాన్ని వారు గుర్తుపట్టి కళ్ళు విప్పార్చి తల్లిమొహాన్ని తదేకంగా చూస్తారని అమెరికా పరిశోధకులు కనుగొన్నారు.

ఇంకా పిల్లలు మిగతవారి కంఠస్వరాల కంటే తల్లి గొంతు అంటేనే ఎక్కువ ఇష్టపడతారని తేలింది. ఏడుస్తున్న పిల్లలు మిగతావారు ఎంత బుజ్జగించినా ఊరుకోరు. తల్లి సముదాయిస్తే ఏడుపు ఆపుతారు. ఆమె గొంతు శ్రావ్యంగా ఉండకపోయినా తల్లులు జోలపాట పాడితే పిల్లలు ఆనందంగా వింటూ నిద్రలోకి జారిపోతారు.

తల్లికీ, గర్భస్థ శిశువుకూ మధ్య అనుబంధం ఎలా పెరుగుతుంది?

రెండో త్రైమాసికంలో పిండం ఎదుగుదల బాగా ఊపందుకుంటుంది. శిశువు కదలికలు కూడా గుర్తుపట్టటం మొదలయ్యే సమయం ఇది. రెండు నెలల కిందట కేవలం కొన్ని కణాల గుంపుగా ఉన్న పిండం క్రమంగా దేహ భాగాలు రూపుదిద్దుకుంటుంది.

  • నాడులు, కండరాలు ఏర్పడతాయి
  • 18వ వారానికల్లా శిశువు వినటం మొదలుపెడుతుంది
  • ఇరవయ్యో వారానికి వచ్చేసరికి అంటే గర్భధారణ మొదలు ప్రసవం దాకా ఉండే సమయంలో సరిగ్గా సగానికి వచ్చినప్పుడు శిశువు కదలికలు స్పష్టంగా తెలుస్తాయి.
  • ఎప్పుడు నిద్రపోతున్నదీ, ఎప్పుడు మెలకువగా ఉన్నది కూడా తెలుస్తుంది.
  • తల్లి కదలికలకు, శబ్దాలకు ఉలిక్కిపడి మేలుకోవటం కూడా గమనించవచ్చు.
  • శిశువు తన వేలు చీకటం కూడా మొదలు పెడుతుంది.

ఇది కూడా చదవండి

ఇలా చేస్తే పిల్లలు పక్క తడిపే అలవాటుని మానుకుంటారు

ఇరవై మూడు వారాలు దాటాక కళ్ళ కదలికలు మొదలవుతాయి. దాదాపు అదే సమయంలో ఎక్కిళ్ళు రావటం, ఫలితంగా కదలికలు కూడా తెలుస్తాయి. ఇరవై ఐదో వారంలో తల్లి గొంతు విని శిశువు స్పందించటం మొదలవుతుంది.

అదే విధంగా శబ్దాలతో పరిచయం ఏర్పడుతుంది. ఎప్పుడూ వినే శబ్దాలను గుర్తుపట్టగలుగుతుంది. ముప్పై రెండు వారాల కల్లా శిశువు ఊపిరిపీల్చటం ప్రాక్టీస్ చేస్తుంది. ముప్పై ఆరు వారాలకల్లా కాన్పుకు సిద్ధమవుతున్న దశలో శిశువు కదలికలు చాలా పరిమితంగా ఉంటాయి.

కదలటానికి తగినంత స్థలం లేకపోవటం ఒక ప్రధాన కారణం కావచ్చు. ఏమైనప్పటికీ కొద్దిపాటి కదలికలు, గుండ్రంగా తిరగటం లాంటి లక్డ్షణాలు కనబడతాయి. ముందుగా బయటికి రావటానికి తలభాగం సిద్ధమై అందుకు అనుగుణంగా దిశను సిద్ధం చేసుకుంటుంది. అలా జరగకపోతే ఏం చేయాలో డాక్టర్లే నిర్ణయిస్తారు. అదే సమయంలో శిశువు కదలికలు పరిమితంగా ఉంటాయి కాబట్టి కంగారు పడకూడదు.

“కదలికలు కనబడాల్సిన సమయంలో కనబడకపోతే మాత్రం కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి”

చివరిగా

శిశువు రాత్రిళ్ళు ఎక్కువగా కదులుతూ ఉంటే కంగారు పడనక్కర్లేదు. మధ్యరాత్రి సమయంలో కాసేపు నిటారుగా కూర్చుంటే సరిపోతుంది. రోజువారీ పనులు మామూలుగానే చేసుకుంటూ ఉండాలి. అదే సమయంలో శిశువు స్పందిస్తుందా లేదా గమనించుకోవాలి. ఏవైనా తేడాలు ఉంటే మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి.   శిశువు నిశ్శబ్దంగా ఉన్నాడని అనిపించినప్పుడు  కంగారు పడాల్సిన అవసరం లేదు.  బిడ్డ నిద్రపోయే విధానంలో మెరుగుదల కనబడుతున్నట్టు  తెలుసుకోవాలి.

“అదే సమయంలో ఎప్పుడైనా భయంగా అనిపిస్తే మాత్రం కచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలి”

శిశువు కదలికల అనుభూతిని ఆనందించటంతో బాటు అప్రమత్తంగా ఉండాలన్న అవగాహన ఉంటే సరిపోతుంది. అవసరాన్ని బట్టి డాక్టర్లు తగిన చికిత్స చేస్తారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top