అడిక్షన్లను దూరం చేసుకోవాలంటే ?

పొగ ఏ విధంగా త్రాగినా, అది ఆరోగ్యానికి ప్రమాదకరం. ఎసిటోన్, తారు, నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ వరకు పొగాకు ఉత్పత్తుల్లో హానికారక పదార్థాలు అనేకం ఉంటాయి. ధూమపానం చేస్తూ పీల్చే పదార్ధాలు కేవలం ఊపిరితిత్తులను మాత్రమే ప్రభావితం చేయవు. అది మొత్తం శరీరాన్ని మరియు మెదడును ప్రభావితం చేయవచ్చు. ధూమపానం శరీరంలోని వివిధ సమస్యలకు దారితీస్తుంది, అలాగే శరీర వ్యవస్థలపై దీర్ఘ-కాలిక ప్రభావాలు ఉంటాయి.

పొగతో అనర్ధాలు ఎన్నో

దృష్టి లోపం, రక్త నాళాలలో ఎక్కువ ఒత్తిడి, రోగనిరోధక వ్యవస్థ చెడిపోవటం, సీఓపీడీ, అధిక కొలెస్ట్రాల్, రక్తం గడ్డకట్టడం, ఆకలి లేకపోవటం, వంధ్యత్వం, అంగస్తంభనo, బ్లడ్ క్యాన్సర్  ప్రమాదం, డయాబెటిస్ సమస్యలు, ఆందోళన మరియు చిరాకు ఇలా ధూమపానం తెచ్చిపెట్టే సమస్యల చిట్టాకు అంతూదరి ఉండదు.

ఆల్కహాల్ తో దీర్ఘకాలిక వ్యాధులు

మద్యపానం ఒక వ్యసనం. క్రమం తప్పకుండా తీసుకోవడాన్ని ఆల్కహాల్‌ యూస్‌  డిజార్డర్‌ అంటారు. ఇలాంటి వారు ఏదో వంకతో ఆల్కహాల్‌ సేవిస్తూనే ఉంటారు. శారీరకంగా, మానసికంగా తమపై తాము పట్టుకోల్పోతారు.  ఈ వ్యసనం అనేది తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

వ్యసనాలను వదిలించుకోవడం సులువే

2011లో ప్రచురితమైన ఆల్కహాల్ రీసెర్చ్ కరెంట్ రివ్యూస్‌లో ఒక అధ్యయనం ప్రకారం క్యాన్సర్, అంటు వ్యాధులు, డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు, కాలేయ వ్యాధితో సహా 30కి వ్యాధులకు మద్యపానమే మూలకారణమని తేలింది. అందుకే మద్యపానం బారిన పడ్డ వారు సరైన డాక్టర్ పర్యవేక్షణలో ఆ వ్యసనం బారి నుండి బయటపడాలి.ధూమపానం, మద్యపానం ఈ రెండూ కూడా ఆరోగ్యాన్ని చిత్తు చేస్తున్న రాహుకేతువుల్లాంటివి. వీటి బారిన పడకుండా ముందుగానే జాగ్రత్తపడాలి. ఒకవేళ ఇప్పటికే ఈ వ్యసనాలు ఉన్నా కూడా డాక్టర్ సాయం తీసుకుని వాటి నుండి బయట పడడం సాధ్యమే.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top