Q&A: స్త్రీలు Unwanted 72 వాడితే ఆ నొప్పి తప్పదా?

Unwanted72 pills

సమస్య:

నేను రెండు రోజుల క్రితం శృంగారం తరువాత ఆన్ వాంటెడ్ 72 తీసుకున్నాను. నాకు తరువాత రోజు ఉదయం నుండి పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. నొప్పి దానంతకదే ఆగిపోతుందని అనుకున్నాను కాని నొప్పి తగ్గలేదు. తరువాత రోజు రెండుసార్లు Meftal-Spas తీసుకోవడం ప్రారంభించాను. నొప్పి తగ్గుముఖం పట్టి సాయంత్రం వరకు పూర్తిగా తగ్గింది. మళ్ళీ తరువాతి రోజు నొప్పి వచ్చింది. దీనివల్ల నా పీరియడ్స్ కూడా సమస్యలు వస్తాయా? ఎందుకిలా ఆవుతోంది?

సలహా:

Un-wanted 72 అనేవి అత్యవసర పరిస్థితుల్లో గర్భాన్ని నిరోధించడానికి ఉపయోగించే మాత్రలు. ఇవి నోటి ద్వారా వేసుకునే మాత్రలు. ప్రెగ్నెన్సి ప్లాన్ చేసుకోకుండా కలిసినపుడు ఈ మాత్రలు వాడటం జరుగుతుంది. గర్భాన్ని నిరోధించడానికి ఈ మాత్రలు చాలా బాగా పనిచేస్తాయి. ఇది అండాశయం నుంచి అండం విడుదల కాకుండా అపుతుంది. ఫలధీకరణకి అడ్డు గోడగా నిలుస్తుంది. దాంతో గర్భం నిరోధించబడుతుంది.

Un-wanted 72లో ప్రొజెస్టిరాన్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కలిసిన తరువాత 72 గంటల్లో గర్భాన్ని నిరోధించడానికి ఇది సహాయపడుతుంది.

అయితే ఈ హై డోస్ ప్రొజెస్టిరాన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.

అవేంటంటే:

  • పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా రావడం
  • ఒక్కోసారి ఎక్కువ బ్లీడింగ్ అవడం
  • ఒకోసారి అసలు బ్లీడింగ్ కాకపోవడం
  • మళ్ళీ పీరియడ్ ఎప్పుడొస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి కూడా ఉంటుంది
  • కొన్నిసార్లు ఇది ఇర్రెగులర్ పీరియడ్స్ కు కూడా దారి తీస్తుంది

ఆన్ వాంటెడ్ 72 వాడిన కొంతమంది స్త్రీలు

  • బరువు పెరుగుతారు, తలనొప్పి కూడా ఉంటుంది
  • ఇవే కాకుండా కొంతమందిలో వాంతులవుతున్నట్టుగా అనిపించడం
  • కళ్ళు తిరగడం వంటివి కూడా జరుగుతాయి

అందుకే చాలావరకు ఈ Un-wanted 72 ని వాడకపోవడమే మంచిది. ఎంత వీలైతే అంత ఈ పద్ధతికి దూరంగా ఉండటమే మేలు. ఇందులో ప్రొజెస్టిరాన్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి దీని నుంచి సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటాయి.

మీరు Meftal-Spas వాడుతున్నాను అన్నారు. ఈ టాబ్లెట్లు పొత్తి కడుపులో నొప్పిని, తిమ్మిర్లను తగ్గిస్తాయి. మీకు మళ్ళీ పీరియడ్స్ వచ్చే వరకు అవే టాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. పీరియడ్స్ రెగ్యులర్ అవడానికి రెండు నెలలు కూడా పట్టవచ్చు. అంతవరకు మీరు Metal-spas వాడటమే మంచిది.  

[wpdiscuz-feedback id=”k8v7z9lu4u” question=”Please leave a feedback on this” opened=”0″][/wpdiscuz-feedback]

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top