Q&A I లాక్ డౌన్ కారణంగా నాలో టెన్షన్ పెరిగింది, ఏంచేయాలి?

Lockdown stress

జవాబు :

మనమందరం కోవిడ్ ఇన్ఫెక్షన్ కి దూరంగా ఉంటూ మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మనకు మానసిక ఆరోగ్యం చాలా అవసరం. ఈ సందర్భంగా మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం సమతుల ఆహారం తీసుకోవాలి. పౌష్టికాహారం, వ్యాయామం, విశ్రాంతి తీసుకోవడం ఇవన్నీ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి.

ఇంతేకాకుండా యోగా, మేడిటేషన్ చేయడం ద్వారా కూడా ఒత్తిడిని తగ్గించుకుంటే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటన్నింటినీ మించి మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే మరో ఆయుధం ఆహ్లాదంగా నవ్వుతూ ఉండటం.

కరోనా వైరస్ సృష్టించిన ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న సందర్భంలో నవ్వుతూ ఉండటం అనేది కొంచెం కష్టమే అయినా రోగనిరోధక శక్తి పెరగాలంటే పరిస్థితులని పాజిటివ్ దృక్పథంతో చూస్తూ ఆనందంగా గడిపే ప్రయత్నం చేయాలి.

నవ్వుతూ ఉండటం ద్వారా ఈ ఇబ్బందికర పరిస్థితులను సులువుగా మార్చుకోవడమే కాదు ఆనందంగా  ఉండటం వలన ఆరోగ్యానికి మరెన్నో లాభాలు కూడా ఉన్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top