Cancer Vaccine: క్యాన్సర్ టీకా త్వరలోనే

నిజానికిది ఫ్లూ, పోలియో లాంటి టీకాల మాదిరిగా జబ్బుని నివారించదు కానీ క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టకుండా కాపాడుతుంది.

క్యాన్సర్ టీకా ఎదురుచూపులకు త్వరలోనే తెరపడనుందా? క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొననేందు శాస్త్రవేత్తలు రూపొందించిన మార్గం ఇలాంటి ఆశలే రేకెత్తిస్తోంది. దీనిలోని కీలకాంశం.. క్యాన్సర్ కణితులను గుర్తించి, వాటిని తుదముట్టించే తీరుని రోగనిరోధకశక్తికి నేర్పించడం.

నిజానికిది ఫ్లూ, పోలియో లాంటి టీకాల మాదిరిగా జబ్బుని నివారించదు కానీ క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టకుండా కాపాడుతుంది. కణితి కణాల్లోని ప్రోటీన్లను ప్రమాడకరమైనవిగా గుర్తించేలా రోగనిరోధకశక్తికి ట్రైనింగ్ ఇస్తుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇమ్యూనోథెరపీ ప్రభావాన్ని మరింత పెంచుతుందని ఆశిస్తున్నారు.

రోగనిరోధక చికిత్సను ఎంఆర్ ఎన్ ఏ టీకాతో కలిపి ఇవ్వగా స్కిన్ క్యాన్సర్ మళ్ళీ వచ్చే ముప్పు తగ్గి, మరణించే అవకాశాలు 44 శాతం వరకు నివారించబడుతున్నట్టు తెలిసింది. అందుకే ఇది చాలా ఉత్సుకతను రేకెత్తిస్తోంది. ఎంఆర్ ఎన్ ఏ ఆధారిత క్యాన్సర్ టీకా సామర్ధ్యం ఓ  చిన్నపాటి అధ్యయనంలో బయటపడటం ఇదే తొలిసారి. పెద్ద పరిశోధనల్లోనూ మంచి ఫలితం కనిపిస్తే క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు రాగలవని భావిస్తున్నారు.

అయితే ఈ టీకాను విస్తృతంగా, చవకగా అందుబాటులోకి తేవడానికి చేయాల్సింది చాలానే ఉంది. ఆయా వ్యక్తుల్లోని కణితులకు అనుగుణంగా దీన్ని రూపొందించాల్సి ఉంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top