తెలంగాణ: TSPSC గ్రూప్-2 (Group 2) పరీక్షల తేదీలు ఖరారు

TSPSC Exam Candidates

తెలంగాణలో గ్రూప్-2 (Group 2) పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సి ఖరారు చేసింది. ఆగష్టు 29,30 తేదీలలో గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమీషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

పరీక్షకు వారం రోజుల ముందు నుంచే హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్-4 పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సి ఇప్పటికే ఖరారు చేసింది. జూన్ 5 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు, జులై 1 న గ్రూప్ 4 పరీక్షలు జరగనున్నాయి.

మూడు రోజుల్లోనే 1.10 లక్షల దరఖాస్తులు, ఒక్క పోస్టుకు 705 మంది పోటీ

రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి 783 పోస్టులకుగాను 5,51,943 దరకాస్తులు వచ్చినట్లు తెలంగాణ టీఎస్పీఎస్సి (tspsc) తెలిపింది. జనవరి 18 నుంచి ఆన్లైన్లో ధరకాస్తులు స్వీకరించగా చివరి మూడు రోజుల్లోనే 1.10 లక్షల దరకాస్తులు రావడం గమనార్హం. గ్రూప్-2 పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు. ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ విషయాలను పరిగణలోకి తీసుకున్న తరువాతే పరీక్షా తేదీని నిర్ణయించినట్టు అధికారులు తెలియజేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top