ఇక చాలు మీ సేవలు: భారీ మూల్యం చెల్లించుకుంటున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు

హైదరాబాద్, తెలుగు రిపోర్టర్: కరోనా ప్రభావం హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మీద కూడా పడింది. గత రెండు రోజుల్లో దాదాపు 10,000 మందికి పైగా వివిధ సాఫ్ట్ వేర్ కంపెనీల నుంచి పింక్ లెటర్లు ఈమెయిల్స్ ద్వారా అందుకున్నారు. అయితే ఈ సంఖ్య ఏప్రిల్ నెలాఖరుకల్లా లక్ష దాకా చేరవచ్చని ఐటి మేనేజ్ మెంట్ లు చెబుతున్నాయి. హైదరాబాదులో దాదాపు 1500 ఐటి కంపెనీలు ఉండగా వాటిలో దాదాపు 5 లక్షల మంది వరకూ ఉద్యోగులు ఉన్నారు.

అయితే మార్చి నెల పూర్తి కాగానే చాలా ఉద్యోగులు ఇలాంటి మెయిల్స్ అందుకోవడం చాలా మంది ఉద్యోగులను అంధోలనకు గురిచేస్తోంది. కొంతమందికి కంపెనీలకు యాక్సెస్ ని కూడా తొలగించారు. కారణం అడిగితే ‘ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్ పూర్తయింది, మరో ప్రాజెక్ట్ వచ్చినపుడు కబురు చేస్తాం’ అని ఉద్యోగులకు మెయిల్స్ వస్తున్నాయి. ఈ విధంగా రానున్న రోజుల్లో వచ్చే సంక్షోభం కారణంగా ఉద్యోగులకు జీతాలు చెల్లించుకోలేక ఐటి కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపే పనిలో పడ్డాయి. ఏది ఏమైనా కరోనా ఎఫెక్ట్ చాలా మంది ఉద్యోగులను రోడ్డు మీద పడేసింది.

1 thought on “ఇక చాలు మీ సేవలు: భారీ మూల్యం చెల్లించుకుంటున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు”

  1. Pingback: 86 సంవత్సరాల తల్లితో పాటు, ముగ్గురు కొడుకులు కరోనా వ్యాధితో మృత్యువాత

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top