“రామాయణం – 2020”: టెలివిజన్ చరిత్రలోనే రికార్డు

Ramayan (twitter)

దూరదర్శన్ లో ప్రసారమైన రామాయణం చరిత్రలో కనీ వినీ ఎరుగని రికార్డులని సృస్టించింది. గత వారంలో ప్రసారమైన నాలుగు షోలను దేశం మొత్తం మీద 170 మిలియన్ ప్రజలు వీక్షించడం జరిగింది. దేశం మొత్తం 21 రోజుల లాక్డౌన్ లో ఉన్న వియయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో మూడు దశబ్ధాల క్రితం ప్రసారమైన రామాయణాన్ని మల్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మూడు దశాబ్ధాల క్రితం నిర్మించి ప్రసారం చేసిన కార్యక్రమమే అయినా ఇప్పటికీ రామాయణం పట్ల అదే ఆదరణ నిలిచి ఉండటం చాలా గర్వంగా ఉందంటున్నారు నేషనల్ దురదర్శన్ యాజమాన్యం.

గత వారం ప్రసారమైన ఈ సీరియల్ ఏకంగా 170 మిలియన్ల వీక్షకులను సాధించిందని ఆ రిపోర్ట్ చెబుతోంది. ఇది హింది భాషలో టెలికాస్ట్ అవుతున్న వినోద కార్యక్రమాలు, సీరియల్స్ కంటే కూడా అత్యధిక స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందిన సీరియల్ గా బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రిసర్చ్ కౌన్సిల్ చెబుతోంది. పోయిన శనివారం నేషనల్ దురదర్శన్ లో టెలికాస్ట్ అయిన రామాయణం ప్రసార వేళలను, వివరాలను ప్రభుత్వం వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందించింది. అందుకే ఇది ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువయ్యింది.

ఈ సందర్భంగా BARC చీఫ్ ఏక్సిక్యూటివ్ ఆఫీసర్ సునిల్ లుల్ల ప్రసార భారతి దేశం లాక్డౌన్ ఉన్న సందర్భాన్ని సధ్వినియోగం చేసుకుందని కొనియాడారు. ఈ రేటింగ్ ద్వారా ముందు ముందు ప్రసారమయ్యే షోలతో అడ్వటైజర్స్ ను బాగా ఆకర్షించవచ్చని సునిల్ లుల్ల అభిప్రాయ పడ్డారు.

గత శనివారం ప్రసారమైన ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్ 34 మిలియన్ల వీక్షకులను సాధించగా, అదే రోజు సాయంత్రం ప్రసారమైన ఎపిసోడ్ 45 మిలియన్ల వీక్షకులను కట్టిపడేయడంతో దీని రేటింగ్ 5.2 శాతాన్ని నమోదు చేసింది. మల్లీ ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్ 40 మిలియన్ల వీక్షకులను చేరింది. అదే రోజు సాయంత్రం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ 51 మిలియన్ల వీక్షలను తాకింది.

రామానంద్ సాగర్ నిర్మించిన రామాయణంలో అరుణ్ గొవిల్ రాముడి పాత్రలో, సునిల్ లేహ్రీ లక్ష్మణుడి పాత్రలో నటించగా సీత పాత్రలో దీపిక నటించారు.

1 thought on ““రామాయణం – 2020”: టెలివిజన్ చరిత్రలోనే రికార్డు”

  1. Pingback: 86 సంవత్సరాల తల్లితో పాటు, ముగ్గురు కొడుకులు కరోనా వ్యాధితో మృత్యువాత

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top