Q&A: ఇవాళ మా ఫ్రెండ్ కి Covid19 పాజిటివ్ వచ్చింది, నేను రేపే టెస్ట్ చేయించుకోవాలా?

When should I go for test?

సమస్య:

నేను ఈ రోజు ఉదయం నా స్నేహితురాలితో కలిసి భోజనం చేశాను. భోజనం చేసే సమయంలో మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. ఒకరి ఆహారం ఒకరం షేర్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే సాయంత్రం సమయంలో నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసి తనకు Covid-19 టెస్ట్ పాజిటివ్ వచ్చిందని చెప్పింది. నేను ఒక్కసారిగా భయానికి గురయ్యాను. ఇప్పుడేం చేయాలి? నేను రేపు టెస్ట్ చేయించుకోవాలా? నేను టెస్ట్ ఎప్పుడు చేయించుకుంటే మంచిది?

సలహా:

ఇవాళ మా ఫ్రెండ్ కి పాజిటివ్ అని తెలిసింది, రేపు నేను టెస్ట్ చేయించుకోవాలా అని మీరు అడుగుతున్నారు. రేపే మీరు టెస్ట్ చేయించుకోవడం వలన ఉపయోగం ఉండకపోవచ్చు. లక్షణాలు కనపడకుండా పరీక్ష చేయించుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే!

కోవిడ్ వ్యాధి మనల్ని వదిలి  వెళ్లడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక రకంగా మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో చాలా కాలం తరువాత కలిసిన స్నేహితులతోనో, బంధువులతోనో కలిసి భోజనం చేయడం, కాసేపు కబుర్లు చెప్పడం తప్పనిసరి అయిపోతుంది. అలా మనతో కాసేపు సమయం గడిపిన వారికి పాజిటివ్ వచ్చిందని తెలిస్తే ఇంకేముంది?

ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు ఇలా చాలా మంది జీవితాల్లో జరిగుతూనే ఉంది. కోవిడ్ వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమి లేదు? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒకచోట ఇది అంటుకుంటూనే ఉంది. మరి ఇటువంటి సందర్భంలో మీ ఫ్రెండ్ కి కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే మీరు టెస్ట్ చేయించుకోవడం వల్ల కరోనా వైరస్ మీ శరీరంలో ఉందో లేదో తెలుస్తుందా అంటే… అనుమానమే?

చాలా చోట్ల Covid-19 వ్యాధిని గుర్తించడానికి చేస్తున్న పరీక్ష, ముక్కులోంచి తీసుకున్న శ్లేష్మంలో కరోనా వైరస్ కణాలు ఉన్నాయేమో చెక్ చేయడం. శ్లేష్మంలోకి చేరిన వైరస్ కణాల ఉత్పత్తిని పెంచినపుడే పరీక్ష కోసం తీసుకున్న శ్లేష్మంలో వైరస్ కణాలు గుర్తిచబడతాయి. చాలా తక్కువ మోతాదులో వైరస్ కణాలు ఉన్నప్పటికీ అవి పరీక్షలో బయటపడవు.

అంటే మీరు సోమవారం కరోనా వ్యాధి గ్రస్తులను కలిశారనుకోండి, మంగళవారం మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఒక్క రోజు వ్యవధిలోనే మీ శరీరంలో వైరస్ కణాల ఉత్పత్తి జరగదు. మీ శరీరంలో వైరస్ బహిర్గతం కావడానికి కొన్ని రోజుల సమయం ఖచ్చితంగా పడుతుంది.

ఈ పరీక్షతో వచ్చిన సమస్య ఏంటంటే కరోనా ఉన్న వ్యక్తిని మీరు కలిసిన తరువాత రోజే మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే (ఇది వైరల్ లోడ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది) మీకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఒక అధ్యయనంలో తెలిసిన విషయం ఏంటంటే మీరు 100% కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తిని కలిసినప్పటికీ ఒక రోజు వ్యవధిలోనే మీరు పరీక్ష చేయించుకుంటే మీ తప్పుడు రిపోర్ట్ వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది.

అలాంటి తప్పుడు రిపోర్ట్ ఆధారంగా మీలో ఒక తప్పుడు ఆత్మవిశ్వాసం ఏర్పడి నాకేం కాలేదు అనుకుని మళ్ళీ మీరు నార్మల్ లైఫ్ లోకి వెళ్లిపోతారు అది ప్రమాదమే.

ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే, కోవిడ్ వ్యాధి ఉన్న వ్యక్తిని కలిసినట్టుగా మీరు నిర్ధారించుకున్న వెంటనే మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఐసోలెట్ చేసుకోవాలి. మీ కుటుంబ సభ్యులను కానీ, మీ చుట్టూ పక్కల వ్యతులను కానీ కలవకుండా మిమ్మల్ని మీరు నిర్భంధించుకోవాలి. మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ కి ఫోన్ చేసి మీరు కోవిడ్ పరీక్ష ఎప్పుడు చేయించుకుంటే కరెక్ట్ రిజల్ట్ తెలుస్తుందో అడిగి తెలుసుకోండి.

మీకు ఖచ్చితంగా కోవిడ్ వ్యాధి సోకే అవకాశం ఉందని నిర్ధారించుకున్న తరువాత, మీరు కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి హెల్త్ సెంటర్ కి వెళ్ళినపుడు గానీ, లేదంటే ఏదైనా ఇతర మందులను తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళినపుడు గానీ ఖచ్చితంగా మాస్క్ ధరించాలి.

అదేవిధంగా ఇతర వ్యక్తులకు 6 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. మీకు ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకపోయినప్పటికి మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

[wpdiscuz-feedback id=”v8vkepyrbx” question=”Please leave a feedback on this” opened=”0″][/wpdiscuz-feedback]

                                                                                 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top