కరోనా…కరోనా! నీ కథ ముగిసేనా ఎప్పటికైనా?

కోవిడ్ వ్యాధికి అంతం ఉందా?

ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న కోవిడ్ వ్యాధికి అంతం ఉందా? దీనికొక ముగింపు అంటూ రాయబడిందా? దీన్ని అంతమొందించే వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది? ఇప్పుడు అందరి మెదళ్ళను తొలిచేస్తున్న ప్రశ్నలివి.  

సోకుతూనే ఉంది

కోవిడ్ వ్యాధిని ఎంతగానో అర్థం చేసుకున్నాం, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయినా ఎక్కడో ఒక చోట తెలిసిన వారికో, దూరంగా ఉన్న బంధువులకో, విదేశాల్లో ఉన్న స్నేహితులకో కరోనా సోకినట్టుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఈ భయానికి, జాగ్రత్తలకు అంతమనేది ఉందా?

కోవిడ్ వ్యాధి పూర్తిగా నిర్మూలించబడుతుందా? అనే ప్రశ్న చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పలేకపోతున్నారు. డాక్టర్ లు, పరిశోధకులు, సైంటిస్టులు ఇంకా సమాధానం వెతికే పనిలోనే నిమగ్నమై ఉన్నారు.

జీవితాంతం ఉంటుందా?

ఒక్క మాటలో చెప్పాలంటే సమాధానం ‘లేదు’ అనే చెప్పాలి. అవును కరోనా వ్యాధికి అంతం లేదు. ఇప్పటివరకు క్షుణ్ణంగా జరిగిన పరిశోధనల ఆధారంగా ఒక విషయాన్ని నమ్మాల్సి వస్తోంది. అదేంటంటే “కోవిడ్ వ్యాధి మనతో మన జీవితాంతం ఉంటుంది”. అవును మనకు తరచుగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం లాగా ఇది కూడా మనతో ఎప్పటికీ ఉంటుంది.

రోగనిరోధక శక్తితోనే అంతం

అయితే ప్రతి జబ్బుకి ఒక మందు ఉన్నట్టే కోవిడ్ వ్యాధికి కూడా మందు కనిపెట్టబడుతుంది. చివరికి కోవిడ్ ముగిసే రోజు కూడా వస్తుంది. ఒక దశలో కావాల్సినంత మందికి కోవిడ్ వ్యాధి (SARS-CoV-2) నుంచి రక్షణ కలిపించే రోగనిరోధక శక్తి వస్తుంది.

కోవిడ్ వ్యాధి సోకి దాన్నుంచి బయటపడటం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. లేదా వాక్సిన్ తీసుకున్నవారిలోనూ రోగాన్ని నిరోధించే శక్తి పెంపొందుతుంది. అయితే కోవిడ్ నుంచి బయటపడిన వారిలో ఎంత మోతాదులో రోగనిరోధక శక్తి పెరుగుతుంది లేదా పెరిగిన రోగనిరోధకశక్తి (యాంటిబాడీస్) ఎంతకాలం మన శరీరంలో ఉంటుంది అనేదానికి ఖచ్చితమైన నిర్ధారణ లేదు.

ఇలా అయితే ఆందోళన తప్పదు

కోవిడ్ వ్యాధి చికిత్స, నిర్మూలన కోసం ఇంతవరకు కనుగొనబడిన మందులు, జీవనశైలి పద్ధతులు కొంతవరకు ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడుతున్నాయి. అయితే ఎక్కువగా వ్యాపించే లక్షణం కలిగి ఉన్న ఈ వ్యాధి అంతం అయిన తరువాత మన జీవితాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం ఆలోచించాల్సిన విషయమే. కోవిడ్ వ్యాధికి మందులు, వ్యాక్సిన్లు వ్యాధిగ్రస్తులకు అందుతున్నప్పటికీ అవి పూర్తిగా అందుబాటులోకి వచ్చేసరికి వ్యాధిబారిన పడే వారి సంఖ్య దాని తీవ్రతను తట్టుకోలేక మరణించే వారి సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది నిజంగా ఆందోళన చెందాల్సిన విషయమే.

ఇలా చేస్తే కోవిడ్ వ్యాధికి దూరంగా ఉన్నట్టే!

కరోనా వ్యాధి సృస్టిస్తున్న భయ ప్రకంపనలు మనలో స్థిరపడిపోతున్న మాట వాస్తవం. అయితే కొన్ని కనీసమైన ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని మనం తప్పకుండా అరికట్టవచ్చు.

తీసుకునే జాగ్రత్తలలో భాగంగా

  • సామాజిక దూరాన్ని పాటించాలి
  • ఇద్దరు ముగ్గురు ఉన్న చోట ఖచ్చితంగా మాస్కుని ధరించాలి
  • అప్పుడప్పుడూ శుభ్రంగా చేతులు కడుక్కోవడం

ఈ మూడు సూత్రాలను పాటిస్తే మనం కోవిడ్ వ్యాధికి దూరంగా ఉన్నట్టే.

మన చేతుల్లో ఉన్నది ఒక్కటే కనీస జాగ్రత్తలు పాటిస్తూ వ్యాధిని దూరంగా ఉంచటం. ఇవి చేయగలిగితే కోవిడ్ వ్యాధికి ఎదురొడ్డి యుద్దం చేస్తున్న డాక్టర్ లకి వ్యాక్సిన్ కోసం కష్టపడి పనిచేస్తున్న సైంటిస్టులకి, పరిశోధకులకి మనం సాయం చేసినవాళ్ళమవుతాం. శక్తివంతమైన వ్యాక్సిన్ తయారు చేయడంలో మనం కూడా భాగస్వాములం అవుతాము.

కాబట్టి ఈ మహమ్మారిని పారద్రోలేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుని మనల్ని మనం కాపాడుకుంటూ, మన కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడటానికి మన వంతు కృషి చేద్దాం.

[wpdiscuz-feedback id=”yy3wsch9li” question=”Please leave a feedback on this” opened=”0″][/wpdiscuz-feedback]

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top