Diabetes: పిల్లల్లోనూ షుగర్ వ్యాధి, తొందరగా గుర్తించడం మేలు

పెద్దల్లో వచ్చే షుగర్ వ్యాధి గురించి అలా ఉంచితే పిల్లల్లో ఈ సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. ప్రతి సంవత్సరం మధుమేహం బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడిన పిల్లల్లో ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా కావడమో లేదా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడమో జరుగుతుంది.

షుగర్ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. పాంక్రియాజ్ గ్రంథి ఇన్సులిన్ ను అసలు ఉత్పత్తి చేయకపోవడాన్ని టైప్ 1 డయబెటిస్ అని అతి తక్కువ మోతాదులో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయడాన్ని టైప్ 2 డయబెటిస్ అంటారు. అయితే టైప్ 1 డయబెటిస్ ను పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. మన దురదృష్టం కొద్దీ చిన్నారులకి కూడా ఇది పాకుతోంది. ఈ విషయం మనకు తెలియడం లేదు. చిన్నవారిలో ఈ సమస్య రాదనే భావనతో మనం దాన్ని గుర్తించట్లేదు. అయితే కొన్ని లక్షణాలతో దీన్ని ఈజీగా గుర్తుపట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు.

షుగర్ వ్యాధిలో స్పర్శ కూడా తెలియదు

చాలా మంది చిన్నారుల్లో అంత త్వరగా మధుమేహ లక్షణాలు కనిపించవు. డయాబెటీస్ ముఖ్య లక్షణం బరువు తగ్గడం. హెల్దీగా ఉన్న చిన్నారులు ఉన్నట్టుండి బరువు తగ్గితే గనుక ఆలోచించాల్సిందే. షుగర్ వ్యాధి ఉంటే ఎక్కువగా దాహం వేస్తుంటుంది. కాబట్టి పిల్లలు నీరు ఎక్కువగా తాగుతుంటారు. షుగర్ వ్యాధి ఉంటే పిల్లలు అతిగా మూత్ర విసర్జన చేస్తుంటారు. ఆ విషయాన్ని గుర్తించాలి. చిన్నారుల్లో కొన్నిసార్లు స్పర్శ ఉండదు ముఖ్యంగా వారి కాళ్లు, చేతులకి ఎలాంటి దెబ్బలు తాకినా ఎలాంటి స్పర్శ ఉండదు. దీన్ని గుర్తించాలి. లేకపోతే వ్యాధి ముదిరి ఇబ్బందిగా మారుతుంది.

సాధారణంగా పిల్లలకు టైప్ 1 డయాబెటిస్ పిల్లల్లో రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో జన్యుపరమైన, పర్యావరణ లోపాలు కారణం కావొచ్చు. టైప్ 1 డయాబెటిస్ మెల్లిటిస్ దగ్గరి బంధువులలో ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో దగ్గరి బంధువులకు ఎవరైనా ఉంటే ఈ వ్యాధి పిల్లలకు 0.4 శాతం పిల్లలకి వస్తుంది. ఇక అదే తల్లికి ఉంటే పిల్లలకు 1 నుంచి 4 శాతం వరకు వస్తుంది. అదే విధంగా ఒక వేళ తండ్రికి ఉంటే వారి పిల్లలకు 3 నుంచి 8 శాతం ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారిలో క్లోమ గ్రంథి అస్సలు పనిచేయదు కాబట్టి వీరి శరీరంలో ఇన్సులిన్ అస్సలు ఉండదన్నమాట. కాబట్టి వీరికి బయటినుంచి ఇంజక్షన్లు ఇవ్వటం ఒక్కటే పరిష్కారం.

డయాబెటిస్ ఇన్ చిల్డ్రన్

అయితే టైప్ 2 డయబెటిస్ లో కోమ గ్రంథి పనిచేస్తూనే ఉంటుంది. ఇన్సులిన్ ఉంటుంది కానీ సరియైన మోతాదులో ఉత్పత్తి కాదు. ఇటువంటి పరిస్థితిలో ఇన్సులిన్ ను వెంటనే ప్రారంభించాల్సిన అవసరం లేదు. కాబట్టి కొంతకాలం వరకు టాబ్లెట్స్ తో వ్యాధిని  నియంత్రిస్తూ తరువాత అవసరాన్ని బట్టి ఇంజక్షన్లకు మారవచ్చు. ఇందులో రకాలను బట్టి చికిత్సలు వేర్వేరుగా  ఉంటాయి. కాబట్టి పిల్లలకు మధుమేహం వస్తే అది ఏ రకమన్నది నిర్ధారించుకోడం చాలా కీలకంగా మారుతోంది. అందుకే పిల్లల్లో గనక మధుమేహం వస్తే దాన్ని టైప్ 1 అనీ కాకుండా డయబెటిస్ ఇన్ చిల్డ్రన్ అంటున్నారు.

పిల్లలకు మధుమేహం వచ్చినపుడు సి-పెప్టైడ్ పరీక్ష చేసి అది రక్తంలో తగినంత ఉంటే క్లోమగ్రంథి పనిచేస్తున్నటుగా గుర్తించవచ్చు. అంతకంటే తక్కువగా ఉంటే క్లోమ గ్రంథి సరిగా పనిచేయట్లేదు అని నిర్ధారించుకోవచ్చు. క్లోమ గ్రంథి పనిచేస్తోందంటే టైప్ 2 గాను అస్సలు పనిచేయట్లేదంటే టైప్ 1 గాను మనం దాన్ని గుర్తించవచ్చు. కానీ చాలా మంది పిల్లల్లో సి-పెప్టైడ్ శాతం సాధారణంగానే ఉంటూ కూడా మధుమేహం వస్తోంది. అంటే వీరిలో క్లోమ గ్రంథి సాధారంగానే పనిచేస్తోంది అయినా కూడా వీరిలో మధుమేహం వస్తోందంటే వీరిది టైప్ 2 డయబెటిస్ గా భావించవచ్చు. కాబట్టి వీరికి ఇంజక్షన్లు ఇవ్వాల్సిన అవసరంలేదు. పెద్దల్లో లాగానే వీరికి కూడా టాబ్లెట్స్ తో చికిత్సను ఆరంభించవచ్చు.

అందరిలో లక్షణాలు ఒకే రకంగా ఉండవు

పిల్లలు మధుమేహం బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని బయట ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, రన్నింగ్ రేస్ ఇలాంటి అవుట్ డోర్ గేమ్స్‌లో పాల్గొనేలా చేయాలి. ఇలా చేయడం వల్ల వారి శరీరం కాస్తైనా శ్రమకి గురవుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి జబ్బులు దరిచేరవు. అదే విధంగా వారి డైట్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. వారు మంచి ఆహారం తీసుకునేలా చూడాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకునేలా ప్రోత్సహించాలి.

మధుమేహంలో మరో లక్షణం కళ్లు కనిపించకపోవడం. చిన్నారులు చాలా సార్లు తమకు సరిగా కనిపించడం లేదని చెబుతారు. షుగర్ వ్యాధి ఉన్నా ఇదే సమస్య కనిపిస్తుంది. అయితే పిల్లలందరిలో ఈ లక్షణాలన్నీ కనిపించాలని ఏం లేదు. కొంతమందికి ఇలాంటి లోపాలు ఏం లేకుండా కూడా సమస్య ఉంటుంది. దాన్ని మనం సకాలంలో గుర్తించకపోతే ఇబ్బందిగా మారుతుంది. తీరా ఈ వ్యాధి పిల్లలతో పాటే పెరుగుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top