Q&A: జలుబు, దగ్గు తగ్గినా కూడా యాంటిబయాటిక్ మందులు వాడుతూనే ఉండాలా?

Anemia in children

సమస్య:

మా పాపకి విపరీతమైన జలుబు దగ్గు ఉంటే డాక్టర్ గారికి చూపించాము. డాక్టర్ ఏడు రోజులకి యాంటిబయాటిక్ మందులు రాశారు. అయితే మూడు రోజులు మందులు వాడగానే పాపకి జలుబు, దగ్గు కంటోల్ కి వచ్చాయి. ఇప్పుడు పాపకి రాసిన యాంటిబయాటిక్ మందులు మిగతా నాలుగు రోజులు కూడా వాడాలా? యాంటిబయాటిక్ మందులు ఎక్కువగా తీసుకోకూడదు అంటారు కదా. సలహా ఇవ్వండి.

సలహా:

ఈ సందేహం చాలా మంది తల్లిదండ్రుల్లో ఉండేదే. పిల్లవాడికి మూడు రోజుల్లో జలుబు, దగ్గు తగ్గిపోయింది కదా ఇంకా ఎందుకు యాంటిబయాటిక్ మందులు కంటిన్యూ చేయాలి, ఆపేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. విషయం ఏంటంటే యాంటిబయాటిక్ మందులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మన శరీరంలో ఉంటేనే డాక్టర్లు ఆ మందులను సిఫార్సు చేస్తారు.

అయితే వైరల్ ఇన్ఫెక్షన్ మాత్రమే కాకుండా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఇంకా మీ పాపలో ఉండే అవకాశం ఉంటుంది కనుక యాంటిబయాటిక్ మందులను ఖచ్చితంగా 5 నుంచి 7 రోజుల వరకు వాడాల్సి ఉంటుంది. మరి మీ పాప విషయంలో డాక్టర్ గారు ఎటువంటి అంచనాకు వచ్చారు అనేదాన్ని బట్టి కూడా మందులు వాడాల్సిన కాలం పెరుగుతూ ఉంటుంది.

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు యాంటిబ్యాక్టీరియల్ మందులు వాడాల్సిన అవసరం వచ్చినపుడు లక్షణాలు తగ్గినా కూడా మందులు వాడాల్సి ఉంటుంది.

మందుల వాడకం అలా మధ్యలో ఆపేస్తే ఆ ఇన్ఫెక్షన్ సగం మాత్రమే తగ్గి ఇన్ఫెక్షన్ మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా మందులు మధ్యలో వదిలేస్తే ఇన్ఫెక్షన్ కు కారణం అయిన బ్యాక్టీరియా యొక్క శక్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

అది బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ అని ఖచ్చితంగా నిర్ధారణ అయినపుడు మీ డాక్టర్ గారు సూచించిన మేరకు ఖచ్చితంగా యాంటిబయాటిక్ మందుల కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది.  

యాంటిబయాటిక్ మందులు ఎక్కువ కాలం వాడితే శరీరంలో ఇతర సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. పది మంది పిల్లల్లో ఒకరికి మాత్రమే ఇలా సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది.

చర్మంపై దద్దుర్లు రావడం, అలర్జీ, విరేచనాలు ఇంకా కడుపు నొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్ కొంతమంది పిల్లల్లో కనబడతాయి. అందుకే గతంలో ఎప్పుడైనా మీ పిల్లలకు యాంటిబయాటిక్ మందులు వాడినపుడు డాక్టర్ కి తెలియజేయడం మంచిది.    

పిల్లల శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వల్ల వచ్చిందా లేక వైరస్ వలన వచ్చిందా డాక్టర్ ని అడిగి తెలుసుకోవాలి. యాంటీబయాటిక్ మందులు వాడితే కలిగే లాభాలను, నష్టాలను గురించి డాక్టర్ తో చర్చించాలి. ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఏ మార్గాలు ఉన్నాయో కూడా తెలుకోవాలి. అంతేకాని ఇన్ఫెక్షన్ తొందరగా తగ్గాలనే ఉద్దేశంతో యాంటీబయాటిక్ మందులు ఇవ్వమని డాక్టర్ పై ఒత్తిడి తీసుకురాకూడదు.

పిల్లలు పుట్టిన తరువాత మొదటి మూడు సంవత్సరాలు వారి ఎదుగుదలలో చాలా ముఖ్యమైన సమయం. పిల్లలకు మందులను రాసే సమయంలో డాక్టర్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. చిన్నపాటి అనారోగ్యాలకు యాంటీబయాటిక్ మందులను సిఫార్సు చేయరు. తీవ్రంగా జ్వరం ఉండటం, నిమోనియా, విపరీతమైన చెవి నొప్పి వంటి సమస్యలు ఉన్నపుడు మాత్రమే డాక్టర్ పిల్లలకు యాంటిబయాటిక్ మందులను రాస్తారు.  

[wpdiscuz-feedback id=”77idjbnazg” question=”Please leave a feedback on this” opened=”0″][/wpdiscuz-feedback]

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top