ఐదుగురు పిల్లలను నదిలోకి తోసేసిన తల్లి

Mother thrown children into River

ఉత్తర ప్రదేశ్: ఐదుగురు పిల్లల తల్లి భర్తతో గొడవపడి పిల్లలను నదిలోకి తోసేసింది. విషయం తెలుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను నదిలోకి దింపి పిల్లల్ని వెతికే పనిలో పడ్డారు.

దిగ్భ్రాంతిని కలిగించే ఒక సంఘటన ఉత్తర ప్రదేశ్ బాధోహి జిల్లాలోని జెగంగిరాబాద్ లో జరిగింది. రోజు కూలి చేసుకుని జీవితాన్ని వెళ్లదీసుకునే ఒక మహిళ లాక్ డౌన్ కారణంగా తన ఉపాధిని కోల్పోయింది. పని ఆగిపోయిన కారణంగా చేతిలో డబ్బులు లేక భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఎంతో మనస్తాపానికి గురయిన ఆ మహిళ తన అయిదుగురు పిల్లలను గంగానదిలోకి తోసేసింది.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన గజఈతగాళ్లను నదిలోకి దింపి పిల్లలను వెతికే పనిలో పడ్డారు. అయితే ఆ స్త్రీ మానసిక స్థితి సరిగా లేదని ప్రాధమిక విచారణలో తేలింది. విచారణ సంగతి పక్కన పెట్టి పిల్లల్ని వెతికే పనిలో పడ్డారు పోలీసులు.

Source: Outlookindia.com

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top