‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ సైలెంట్ గా ‘ఆ పని’ చేయాలనుకున్నాడు!!

World Famous lover pic

మరికొద్ది గంటల్లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విడుదల కానుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే గత సినిమాల ప్రమోషన్ల విషయంలో చేసినట్టుగా అతి చేయకుండా ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు.

గతంలో నటించిన సినిమాల విడుదల సమయంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో గట్టిగా అరుస్తూ, కేకలు వేస్తూ సినిమాపై క్రేజ్ వచ్చే విధంగా నానా హంగామా చేసేవాడు విజయ్. కానీ ఈ సినిమా విషయంలో చాలా సైలెంట్ గా ఉండటం అందరికీ కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పట్టువదలని విక్రమార్కుడిలా విజయ్ దేవరకొండ మనసులోని మర్మాన్ని కనిపెట్టేశారు మన మేధావులు. ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ సైలెంట్ గా ఉండటానికి అసలు కారణం ఏంటంటే, సినిమాకి ముందు నానా హంగామా చేస్తే సినిమా విడుదలైన తరువాత ఆశించినంత రిజల్ట్ రాకపోతే యాంటీ విజయ్ దేవరకొండ ఫాన్స్ ఆ సందర్భాన్ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. అందుకే ఈ కాస్త జాగ్రత్తగా ఉన్నట్టుగా అనిపిస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top