Pulse Oximeter: ఇది మీ దగ్గర ఉంటే కరోనా మీకు దూరం అయినట్టే!

Pulse Oxymeter

Pulse Oximeter

Pulse Oximeter శరీరానికి ఎటువంటి హాని చేయకుండా, ఎటువంటి నొప్పి తెలియకుండా శరీరంలో ఆక్సీజన్ స్థాయిలను తెలియజేసే చిన్న పరికరం. రక్తం శరీర భాగాలకు ఎంత మోతాదులో ఆక్సీజన్ ని సరఫరా చేస్తుందో ఈ పరికరం ద్వారా తెలుసుకోవచ్చు.

రక్తంలోని ఆక్సీజన్ స్థాయిలో ఏమాత్రం తేడా వచ్చినా ఈ Pulse Oximeter పసిగడుతుంది. గుండెకు అందే ఆక్సీజన్ అలాగే కాళ్ళకు, మోచేతులకు అందే ఆక్సీజన్ స్థాయిల్లో తేడాలున్నా Pulse Oximeter ద్వారా తెలుసుకోవచ్చు.

Pulse Oximeter ఒక చిన్న క్లిప్ లాంటి పరికరం. ఇది శరీరంలోని చేతివేళ్ళకు, కాలి బొటన వేలు వంటి భాగాలకు తగిలించి శరీరంలో ఆక్సీజన్ లెవెల్స్ ను గమనించవచ్చు. ఎక్కువగా దీన్ని చేతి వేలుకు అమర్చి ఆక్సీజన్ లెవెల్స్ ను తెలుసుకుంటారు. దీన్ని హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో ఎక్కువగా వాడతారు. ఊపిరితిత్తుల వైద్య నిపుణులు (పల్మనాలజిస్ట్) ఈ పరికారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

Pulse Oximeter: ఎందుకు వాడతారు? ఉపయోగాలు

Pulse Oximeter ద్వారా గుండె ఇతర శరీర భాగాలకు ఆక్సీజన్ ను ఎంత బాగా సరఫరా చేస్తున్నదీ అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. వేరే ఏ ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వారిలోనైనా వారి శరీరంలో ఆక్సీజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఈ పరికరం ద్వారా తెలుసుకోవచ్చు.

ఇటువంటి అనారోగ్యాలతో ఉన్నవారిలో…

  • క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డీసీస్ (COPD)
  • అస్థమా
  • నిమోనియా
  • ఊపిరితిత్తుల క్యాన్సర్
  • రక్తహీనత (anemia)
  • హార్ట్ ఎటాక్ లేదా హార్ట్ ఫెయిల్యూర్
  • పుట్టుకతో వచ్చే గుండె లోపాలు

అంతేకాకుండా సాధారణ అనారోగ్యాలు కలిగినపుడు కూడా శరీరంలోని ఆక్సీజన్ లెవెల్ ను తెలుసుకోవడానికి ఈ Pulse Oximeter ను ఉపయోగిస్తారు.

కొన్ని సాధారణ అనారోగ్యాలలో

  • ఊపిరితిత్తులకు వాడే మందులు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవచ్చు
  • ఎవరికైనా ఆక్సీజన్ అవసరం ఎంతవరకు ఉంది అనే విషయాన్ని విశ్లేషించవచ్చు
  • ఆక్సీజన్ అవసరం ఉన్నవారికి వెంటిలేటర్ వాడాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని గుర్తించవచ్చు
  • ఏదైనా సర్జరీకి ముందు లేదా సర్జరీ జరిగిన తరువాత శరీరంలో ఆక్సీజన్ లెవెల్స్ ను అంచనా వేయవచ్చు
  • ఆక్సీజన్ థెరపీ వంటి చికిత్సలు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తున్నాయో నిర్ణయించవచ్చు
  • శారీరక వ్యాయామం చేస్తున్నవారిలో కలిగే ఆక్సీజన్ హెచ్చు తగ్గులను అంచనా వేయవచ్చు
  • అలాగే గాఢంగా నిద్రించే సమయాన్ని అంచనా వేసే అధ్యయనంలో కూడా ఈ పరికరాన్ని ఉపయోగిస్తారు

ఇది ఎలా పనిచేస్తుంది?

Pulse Oximeter ద్వారా శరీరంలోని ఆక్సీజన్ లెవెల్ ను తెలుసుకునేటపుడు, ఆ పరికరాన్ని చేతి వేలుకు లేదా కాలు వేలుకు తగిలిస్తారు. పల్స్ ఆక్సీమీటర్ వదిలే కాంతి కిరణాలు శరీరంలోని ఆక్సీజన్ స్థాయిలను లెక్కించడానికి రక్తం ద్వారా చేతి వేలు లోపలికి ప్రవేశిస్తాయి. ఈ కాంతి కిరణాలు శరీరంలోకి శోషించుకుపోయే వేగాన్ని బట్టి శరీరంలో అక్ష్సీజన్ లెవెల్స్ ను ఈ ఆక్సీమీటర్ తెలియజేస్తుంది. మీ గుండె కొట్టుకునే వేగంతో పాటు మీ ఆక్సీజన్ సాచురేషన్ లెవెల్స్ కూడా ఇక్కడ తెలుస్తాయి.

ఎక్కడ, ఎలా దీన్ని ఉపయోగించవచ్చు?

పేషెంట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉన్నపుడు లేదా ఇంట్లో ఉన్నా కూడా ఈ పల్స్ ఆక్సీమీటర్ ను ఉపయోగించవచ్చు. కొన్ని సార్లు దీన్ని కొనుక్కుని ఇంట్లో ఉంచుకోమని డాక్టర్ లు కూడా సిఫార్సు చేస్తారు.

Pulse Oximeter పనిచేసే విధానం

  • శరీరంలోని ఆక్సీజన్ లెవెల్ ని తెలుసుకోవడానికి, చేతి వేలుకి గానీ, కాలు బొటన వేలుకి గానీ లేదా చెవి కింది చివరి భాగానికి గానీ క్లిప్ ద్వారా దీన్ని అమరుస్తారు. పరికరాన్ని అమర్చి బటన్ నొక్కగానే పరికరం అమర్చిన చోట అది ఒత్తిడిని కలిగిస్తుంది. అంతేగానీ నొక్కుకు పోవడం వంటిది  జరగదు. కొన్ని సమయాల్లో చిన్న సూది మొన లాంటి పరికరాన్ని చేతి వేలుకి గానీ లేదా నుదురు భాగానికి గానీ తాకే విధంగా అతికిస్తారు. శరీరంలోని ఆక్సీజన్ లెవెల్స్ ను నిర్ధారించిన తరువాత ఈ సూది మొనని తొలగిస్తారు.
  • ఒకవేళ సూది మొనతో పరీక్ష చేస్తున్నట్లయితే, శరీరంలో ఆక్సీజన్ సాచురేషన్ (ఆక్సీజన్ స్థాయిలు) లెవెల్స్ తెలిసే వరకూ ఈ సూది మొనని అలాగే ఉంచుతారు. ఏదైనా సర్జరీ జరుగుతున్న సందర్భంలో, శారీరక వ్యాయామం, నడక వంటివి చేస్తున్న సమయంలో, ఆపరేషన్ నుంచి కోలుకుంటున్న వారికి కూడా ఈ పరికరాన్ని ఉపయోగించవచ్చు. సర్జరీ జరుగుతున్న సమయంలో చేతి వేలికి తగిలించి, సర్జరీ పూర్తయి ఆ మత్తు నుంచి మీరు మేలుకున్న తరువాత దీన్ని తొలగిస్తారు. చాలా ఫాస్ట్ గా సింగిల్ రీడింగ్ తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
  • టెస్ట్ పూర్తయిన తరువాత సూది మొనని (లోబ్) లేదా క్లిప్ ని తొలగిస్తారు.

Pulse Oximeter రీడింగ్

Pulse Oximeter ద్వారా చేసే పల్స్ ఆక్సీమెట్రి టెస్ట్ చాలా ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. మరింత ఖచ్చితమైన ఫలితాల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో మంచి నాణ్యత కలిగిన  పల్స్ ఆక్సీమీటర్ లను ఉపయోగిస్తారు. ఇటువంటి పరికరాలతో ఒకే సమయంలో ఎన్నిసార్లు ఆక్సీజన్ లెవెల్ చెక్ చేసుకున్నా కేవలం 2 శాతం తేడాతోనే ఫలితాలని వెల్లడిస్తుంది. అంటే రీడింగ్ 82 శాతం చూపిస్తుందంటే ఖచ్చితమైన ఆక్సీజన్ సాచురేషన్ 80 నుంచి 84 మధ్యలో ఉందని నిర్ధారించుకోవచ్చు. అయితే శరీర ఉష్ణోగ్రత, కదలికలు, నేయిల్ పాలిష్ వంటివి రీడింగ్ లో వచ్చే తేడాలను ప్రభావితం చేస్తాయి.

మామూలుగా ఆక్సీజన్ ను శరీరంలోని 89 శాతం రక్తం, ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. ఇంత మోతాదులో రక్తం ఆక్సీజన్ ను సరఫరా చేస్తేనే మీ శరీరంలోని కణాలు, అవయవాలు ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. 89 శాతం కంటే తక్కువ రక్తం ఆక్సీజన్ ని సరఫరా చేస్తే ఆ పరిస్థితి శరీరానికి నష్టాన్ని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారిలో రక్తంలో ఆక్సీజన్ లెవెల్స్ 95 శాతం కంటే ఎక్కువగానే ఉంటాయి. 92 శాతం ఉంటే అది హైపోక్సిమియా పరిస్థితికి దారి తీస్తున్నట్టుగా భావించాలి. అంటే శరీరంలో ఆక్సీజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని గుర్తించాలి.

తరువాత ఏంచేయాలి?

ఒకసారి ఆక్సిమెట్రి పరీక్ష పూర్తయిన తరువాత మీ డాక్టర్ ఆ ఫలితాలను చూసి మీకు వేరే పరీక్షలు లేదా చికిత్స అవసరమా లేదా అనే విషయంలో ఒక నిర్ధారణకు వస్తారు. మీకు అందించబడిన ఆక్సీజన్ థెరపీ మీకు కావల్సిన స్థాయిలో ఆక్సీజన్ ను అందించకలేకపోతే తరువాత ఏంచేయాలో మీకు తెలియజేస్తారు. ఒకవేళ మీ ఆక్సీజన్ లెవెల్స్ లో తేడాలుంటే, మీరు ఇంట్లో ఉపయోగించే పల్స్ ఆక్సీమీటర్ లో రీడింగ్స్ ఏ సమయాల్లో తీసుకోవాలో మీకు తెలియజేయడం జరుగుతుంది.

చివరిగా

Pulse Oximeter ద్వారా చేసే Pulse Oximetry పరీక్ష, మీ శరీరానికి ఎటువంటి హాని జరగకుండా, నొప్పి తెలియకుండా మీ రక్తంలోని ఆక్సీజన్ లెవెల్ ని తెలుయజేసే ప్రక్రియ. ఈ ప్రక్రియలో వాడే సూది మొనలు లేదా క్లిప్ ల ద్వారా చర్మానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. ఇది అన్ని రకాలుగా చాలా సురక్షితమైన పద్ధతి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top