పిల్లల్లో తీవ్ర ఆరోగ్య సమస్యగా ‘స్థూలకాయం’

Obesity in Children

ఎదుగుతున్న పిల్లల్లో స్థూలకాయం ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. వయసుకు, ఎత్తుకు తగినట్టు కాకుండా బరువు పెరుగుతున్న పిల్లలు ఆ తరువాత కాలంలో ఎదుర్కోబోయే డయాబెటిస్, హై బీపీ, కొలెస్ట్రాల్ లాంటివి ఒకప్పుడు పెద్దవాళ్ళ సమస్యలుగా భావించే వాళ్ళం. వంశపారం పర్యంగా వచ్చే స్థూలకాయంతో బాటు  జీవనశైలి ద్వారా తెచ్చుకుంటున్న ఊబకాయం ఇటీవల ఎక్కువైంది.

పిల్లల్ని ఊబకాయులుగా ఎప్పుడు నిర్ణయించాలి?

బాగా లావుగా ఉండి ఊబకాయులుగా కనిపించే పిల్లలు సామాజికంగా ఆత్మన్యూనతా భావం ఎదుర్కోవాల్సి వస్తుంది. నలుగురిలో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్కూలు పిల్లలు అలా ఉంటే తోటి పిల్లల మధ్య అవహేళనకు గురవుతారు. స్థూలకాయం లేదా ఊబకాయం అంటే, శరీరంలో అవసరానికి మించి కొవ్వు పేరుకోవటమే. ఇది మొత్తం ఆరోగ్యానికీ చెరుపు చేస్తుంది.

అయితే ఎంత బరువుంటే స్థూలకాయం అనుకోవాలి అనడానికి ఒక లెక్క ఉంది. దాన్నే బాడీ మాస్ ఇండెక్స్ లేదా బి ఎం ఐ అంటారు. ఒక వ్యక్తిలో చదరపు మీటరు దేహానికి 30 కిలోలు దాటితే అది  స్థూలకాయం కింద లెక్క. అంటే, శరీర నిర్మాణం పెద్దదిగా ఉన్నప్పుడు వాళ్ళ బరువు ఎక్కువ ఉండవచ్చు. చిన్నప్పుడు పిల్లలు బొద్దుగా ఉండటం సహజమే. పెరిగే కొద్దీ మామూలుగా తయారవు తారు.

అలా కాకుండా పెరిగేకొద్దీ అసాధారణంగా వళ్ళు పెరుగుతూ ఉంటే కచ్చితంగా అది స్థూల కాయానికి చిహ్నమే. పిల్లల ఎత్తు, బరువు పోల్చి చూశాక బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా స్థూలకాయం ఏ స్థాయిలో ఉందో డాక్టర్లు లెక్కగడతారు. పిల్లల పెరుగుదల క్రమం ఆరోగ్యవంతంగా లేకపోతే అక్కడే తెలిసిపోతుంది. అవసరమైతే ఇతర పరీక్షల ద్వారా కూడా పరిస్థితిని కచ్చితంగా అంచనా వేస్తారు.

కుటుంబంలో ఎవరికైనా ఊబకాయం ఉందా, బరువు-ఎత్తు నిష్పత్తి పట్టికలో స్థానం ఎక్కడుంది, పెరుగుదల క్రమం ఎలా ఉంది అనే అంశాలను బట్టి ఎలాంటి చికిత్స అవసరమో నిర్ణయిస్తారు. ఇలాంటి పిల్లల శరీరాలు తరుచూ అలసటకు గురికావడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.  మార్కెట్లో లభిస్తున్న రకరకాల జంక్ ఫుడ్ వల్ల స్థూలకాయ సమస్య ఉత్పన్నం అవుతోంది.

preventing-obesity-in-children-reasons-and-causes
Obese children

ఊబకాయంతో ఉన్న పిల్లలకు సామాజిక ఇబ్బందులు ఉంటాయా?

బాగా లావుగా ఉండి ఊబకాయులుగా కనిపించే పిల్లలు సామాజికంగా ఆత్మన్యూనతా భావం ఎదుర్కోవాల్సి వస్తుంది. నలుగురిలో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్కూలు పిల్లలు అలా ఉంటే తోటి పిల్లల మధ్య అవహేళనకు గురవుతారు. స్థూలకాయం లేదా ఊబకాయం అంటే, శరీరంలో అవసరానికి మించి కొవ్వు పేరుకోవటమే. ఇది మొత్తం ఆరోగ్యానికీ చెరుపు చేస్తుంది.

అయితే ఎంత బరువుంటే స్థూలకాయం అనుకోవాలి అనడానికి ఒక లెక్క ఉంది. దాన్నే బాడీ మాస్ ఇండెక్స్ లేదా బి ఎం ఐ అంటారు. ఒక వ్యక్తిలో చదరపు మీటరు దేహానికి 30 కిలోలు దాటితే అది  స్థూలకాయం కింద లెక్క. అంటే, శరీర నిర్మాణం పెద్దదిగా ఉన్నప్పుడు వాళ్ళ బరువు ఎక్కువ ఉండవచ్చు.

చిన్నప్పుడు పిల్లలు బొద్దుగా ఉండటం సహజమే. పెరిగే కొద్దీ మామూలుగా తయారవు తారు. అలా కాకుండా పెరిగేకొద్దీ అసాధారణంగా వళ్ళు పెరుగుతూ ఉంటే కచ్చితంగా అది స్థూల కాయానికి చిహ్నమే. పిల్లల ఎత్తు, బరువు పోల్చి చూశాక బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా స్థూలకాయం ఏ స్థాయిలో ఉందో డాక్టర్లు లెక్కగడతారు.

పిల్లల పెరుగుదల క్రమం ఆరోగ్యవంతంగా లేకపోతే అక్కడే తెలిసిపోతుంది. అవసరమైతే ఇతర పరీక్షల ద్వారా కూడా పరిస్థితిని కచ్చితంగా అంచనా వేస్తారు. కుటుంబంలో ఎవరికైనా ఊబకాయం ఉందా, బరువు-ఎత్తు నిష్పత్తి పట్టికలో స్థానం ఎక్కడుంది, పెరుగుదల క్రమం ఎలా ఉంది అనే అంశాలను బట్టి ఎలాంటి చికిత్స అవసరమో నిర్ణయిస్తారు.

ఇలాంటి పిల్లల శరీరాలు తరుచూ అలసటకు గురికావడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.  మార్కెట్లో లభిస్తున్న రకరకాల జంక్ ఫుడ్ వల్ల స్థూలకాయ సమస్య ఉత్పన్నం అవుతోంది.

పిల్లల్లో ఊబకాయాన్ని ఇలా నియంత్రిద్దాం

ఊబకాయానికి ఆహారం గాని, వారసత్వం గాని, వ్యాయమలేమి గాని కారణాలు కాకపోతే రక్తపరీక్ష జరిపి హార్మోన్ల అసమతుల్యతవల్ల అలా జరుగుతున్నదేమో నిర్థారించుకుంటారు.  కొన్ని సార్లు డిప్రెషన్, నిద్రలేమి, దిగులు లాంటివి కూడా ఊబకాయానికి దారితీయవచ్చు. అత్యధిక సందర్భాలలో మాత్రం జీవనశైలి కారణంగానే ఊబకాయం వస్తుంది కాబట్టి ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామం సరిపోతాయి .

అదే పనిగా కూర్చొని టీవీ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం బాగా తగ్గించాలి.  తగినంత పని లేని పిల్లలు బుద్ధిహీనంగా తయారవటంతో బాటు క్రమంగా బరువు పెరుగుతూనే ఉంటారు.

సాధారణ నిషిద్ధ ఆహార పదార్థాలు

 • శీతల పానీయాలు
 • జ్యూస్ లు, చిక్కని షేక్స్‌
 • క్రీడా పానీయాలు, చిప్స్‌
 • వేయించిన ఆహారాలు
 • ఫ్రెంచ్‌ఫ్రైస్‌, బిస్కెట్లు, క్యాండీలు
 • ఐస్‌క్రీమ్లు, చాక్లెట్లు, పిజ్జా, బర్గర్‌, పావ్‌బాజీ

మొదలైన వాటిని చాలా తక్కువ మోతాదులో తీసుకొనేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని తినటం వల్ల పోషక విలువల కన్నా కేలరీలు ఎక్కువగా వస్తాయి.

ఆరోగ్యకరమైన స్నాక్స్‌

 • డ్రై ఫ్రూట్స్‌
 • పాలు, పాల ఉత్పత్తులు
 • సలాడ్లు, పండ్లు ఇవ్వాలి
 • స్వీట్స్ వాడకం తగ్గించాలి
 • పిల్లలకు లంచంగా ఆహారాలను ఇవ్వకూడదు
 • ప్రతి రోజూ తగినంత నీరు తాగేలా ప్రోత్సహించాలి
 • పిల్లలకు వ్యాయామం, ఆటలు అలవాటు చేయాలి 

చివరిగా

ఊబకాయం ఉన్న పిల్లలను అవమానించకుండా, వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి నియంత్రణకు ప్రోత్సహించాలి. అలా నెలకు అరకిలో మాత్రమే తగ్గేలా చూడాలి తప్ప ఒక్కసారిగా బరువు తగ్గటం మంచిది కాదు. మరికొన్ని సందర్భాలలో మందులు వాడాల్సి రావచ్చు. పిల్లలు కొంత మానసికంగా చెదిరిన సమయంలో ఎక్కువగా తినడానికి మొగ్గుచూపుతారు. అలాంటి వారికివ్వటానికి స్టెరాయిడ్‌ మందులున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top