ఆస్థమా ఉంటే స్త్రీలలో సంతానలేమీ సమస్యలు వస్తాయా?

Asthma in Pregnancy

ఊపిరి తిత్తుల్లోకి గాలి ప్రవేశించి మ్యూకస్ ముంబ్రెన్ బ్రాంకైల్ అనే పలచటి పొర గుండా ప్రయాణిస్తుంది. ఈ సమయంలో ఆ పొరకు చికాకు కలిగే చర్య జరిగినప్పుడు ఆస్తమా ఎదురౌతుంది. గాలి ప్రయాణించే మార్గంలోని కండరాలు ముడుచుకు పోయి, ఈ మార్గాన్ని మరింత సన్నగా చేస్తాయి. దీని వల్ల దగ్గు, ముక్కు కారడం, ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడతాయి. స్త్రీలలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద ఆస్తమా తీవ్ర ప్రభావాన్నే చూపుతుంది. స్త్రీలకు ఆస్తమా వచ్చినప్పుడు శ్వాస వ్యవస్థ మీద మాత్రమే కాదు, శరీరంలోని హార్మోన్ల వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

గర్భవతులూ ఇలా జాగ్రత్తపడండి

ముఖ్యంగా గర్భవతుల్లో ఈ సమస్య ఎదురైనప్పుడు మరిన్ని నియమాలు పాటించడం అత్యంత అవసరం. ఇది కష్టంతో కూడిన పనే కావచ్చు గానీ, ఆసాధ్యమైన పని మాత్రం కాదు. స్త్రీలలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం అలర్జీలు, జ్వరం మీద ఉంటుంది.

ఈస్ట్రోజన్ నేరుగా ఆస్తమా సమస్యకు కారణం కాదు.  ఈస్ట్రోజన్ లో మార్పులు జరుగుతున్నప్పుడు అది ప్రోటీన్స్ మీద ప్రభావం చూపుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ లో జరిగే ఎక్కువ తక్కువలు గాలి ప్రవేశించే మార్గంలో వాపునకు కారణం అవుతాయి. ఇది ఆస్తమా లక్షణాలను కలుగజేస్తుంది.

నెలసరిపై ఆస్తమా ప్రభావం

ఎక్కువ మంది స్త్రీలలో ఆస్తమా సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో వారు నెలసరి మీద కూడా దృష్టి పెట్టాలి. హార్మోన్ స్థాయిలో వచ్చే మార్పులు గర్భం మీద, మోనోపాజ్ దశ మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.  

హార్మోన్ స్థాయిల్లో వచ్చే మార్పులే ఆస్తమా గనుక, ఆ మార్పులు నెలసరి మీద కూడా ప్రభావం చూపుతాయి. ఇందులో మొదటిది సమయం. సరైన సమయానికి రావడం, రాకపోవడం లాంటివి హార్మోన్ల మార్పుల వల్ల జరుగుతాయి.

pregnancy-and-asthma:-managing-your-symptoms
pregnancy-and-asthma:-managing-your-symptoms

ఈస్ట్రోజన్ స్థాయి తక్కువగా ఉంటే నెలసరి ప్రారంభం కావడానికి ముందే సమస్యలు ఎదురౌతాయి. ఎక్కుమంది స్త్రీలు ఆస్తమా కారణంగా వచ్చే నెలసరి సమస్యల వల్ల ఆస్పత్రిలో చేరుతూ ఉంటారు. చాలా మంది హార్మోన్ స్థాయి దాదాపు సున్నకు చేరిన తర్వాత తీవ్రమైన సమస్యలు మొదలౌతాయి. గర్భవతులైన మహిళల్లో ఆస్తమాను మూడు బాగాలుగా విభజించ వచ్చు. మొదటి భాగంలో సమస్యలు మరీ ఎక్కువగా ఉంటాయి. రెండో భాగంలో కాస్తంత తగ్గు ముఖం పట్టి, మూడో భాగంలో మళ్లీ పెరుగుతాయి.

ఆస్తమా – గర్భస్థ శిశువుపై ప్రభావం

అయితే గర్భవతుల్లో ఆస్తమా అదుపులో ఉన్నప్పుడు, పుట్టబోయే బిడ్డల మీద ఏ మాత్రం ప్రభావం చూపదు. అదే విధంగా మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీలలోనూ ఆస్తమా సృష్టించే సమస్యలు ఎక్కువే. అందుకే ఆస్తమాకు సంబంధించిన చిన్న పాటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుని సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా నెలసరి సమయంలో శరీరంలో వస్తున్న మార్పులను గమనించాలి.  ఏ మాత్రం సమస్యలు ఉన్నా, దానితో పాటు శ్వాసలో ఇబ్బందులు ఉన్నా ఆస్తమా పరీక్షలు చేయించుకోవాలి.

ఆస్తమా మందులు వాడకపోతే పుట్టే బిడ్డపై ప్రభావం

వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడుతూ ఉండాలి. ముఖ్యంగా గర్భవతులుగా ఉన్న స్త్రీలు, ఓ పద్ధతి ప్రకారం వీటిని వాడడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం మీద తల్లికి ఉన్న ఆస్తమా ప్రభావం తగ్గడానికి ఆస్కారం ఉంది.

చాలా మంది స్త్రీలు పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో మందులను వాడే విషయంలో అశ్రద్ధ చేస్తూ ఉంటారు. నిజానికి ఆస్తమాకు సంబంధించిన మందులు వాడకపోతేనే బిడ్డ మీద ఆధిక ప్రభావం పడుతుంది.

గర్భవతుల్లో ఆస్తమా ఉంటే వారికి సరిగా ఆక్సిజన్ అందదు. వారితో పాటు కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఆక్సిజన్ అందక అనేక అవస్థలు ఎదురౌతాయి. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఆస్తమా సమస్య రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఆస్తమా విషయంలో స్త్రీలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.

చాలా మందిలో ఈ సమస్య మరణానికి కూడా కారణం అవుతోంది. 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల స్త్రీలలో ఈ సమస్య చూపిస్తున్న దుష్ప్రభావం ఏటికేడు పెరుగుతోంది.

చివరిగా

ఆస్తమాను చాలా మంది ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యగానే చూడడం వల్ల అసలు సమస్య ఎదురౌతోంది. దీన్ని ఎప్పుడైతే హార్మోన్ల సమస్యగా గుర్తిస్తారో, అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరకడంతో పాటు, పుట్టబోయే బిడ్డమీద దాని ప్రభావం పడకుండా ఉంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top