తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ – సియం. కేసియార్

CM KCR

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గత 21 రోజులుగా దేశ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

అయితే ఈ రోజు ఏప్రిల్ 11 న లాక్ డౌన్ కి సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని తెలియజేస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూశారు. ఎందుకంటే ఈ రోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల సియం లతో చర్చలు జరిపారు. ఈ నెల 14తో ముగియనున్న మొదటి విడత లాక్ డౌన్ ను సడలిస్తారని అందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ సాయంత్రం జరిగిన ప్రెస్ మీట్ లో సియం కేసీయార్ లాక్ డౌన్ ను పొడిగించాల్సిందేనని ఖరాకండీగా చెప్పేశారు. అయితే ఈ విషయంపై ఇంకా మోడీ నిర్ణయం తెలియాల్సి ఉంది.

ఏదేమైనా తెలంగాణా రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ను చాలా పగద్భంధీగా కొనసాగిస్తామని సియం కేసీయార్ తన కేబినెట్ నిర్ణయాన్ని ప్రకటించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top