సారీ… రెండోసారీ కోవిడ్ రావచ్చు: హాంకాంగ్ సైంటిస్టులు

Corona Reinfection

కోవిడ్ ఒకసారి వచ్చిన తరువాత ఇన్ఫెక్షన్ ని ఎదుర్కొనే యాంటిబాడీలు శరీరంలో ఉత్పత్తి అవుతాయి ఇక కోవిడ్ రెండోసారి రాదు అనుకున్నాం. కానీ ఆ అభిప్రాయం మీద నమ్మకం పెట్టుకోవద్దు అంటున్నాయి హాంకాంగ్ అధ్యయనాలు.

హాంగ్ కాంగ్ లో ఒక వ్యక్తికి వరుసగా 3 రోజుల పాటు దగ్గు, జ్వరం, గొంతు నొప్పితో పాటు తలనొప్పి కూడా ఉంటే మార్చి నెలలో హోస్పిటల్ లో చేరాడు. అతనికి కరోనా పరీక్ష చేస్తే పాజిటివ్ వచ్చింది. చికిత్స తీసుకున్న తరువాత మొదటిసారి టెస్ట్ చేస్తే నెగెటివ్ వచ్చింది. అయితే అతను రెండుసార్లు నెగిటివ్ వచ్చేవరకు ఏప్రిల్ మధ్య నెల వరకు హాస్పిటల్ లోనే ఉన్నాడు.

రెండోసారి ఇన్ఫెక్షన్

ఆ తరువాత అతని వృత్తి రిత్యా స్పెయిన్, యు.కె దేశాలు తిరిగి ఆగస్టు 15న మళ్ళీ హాంగ్ కాంగ్ చేరుకున్నాడు. అయితే ఎయిర్ పోర్ట్ లో చేసే పరీక్షల్లో భాగంగా అతని లాలాజలం తీసుకుని కరోనా టెస్ట్ చేశారు. అందులో అతనికి మళ్ళీ పాజిటివ్ వచ్చింది. అక్కడి సిబ్బంది అతనిని హాస్పిటల్ కి తరలించారు.

ఈసారి అతనికి ఎటువంటి లక్షణాలు లేవు. కానీ రిజల్ట్ మాత్రం పాజిటివ్ వచ్చింది. పూర్తి పరీక్షలు చేస్తే అతని శరీరంలో వైరస్ తక్కువగా ఉందని, వైరల్ లోడ్ కూడా ఇంతకుముందులా ఎక్కువగా లేదని వైద్యులు తేల్చారు. అతని శరీరంలోని రోగనిరోధక శక్తి దృఢంగా ఉండటం వల్లే ఈ సారి వైరల్ లోడ్ పెరగలేదని డాక్టర్ లు నిర్ధారించారు.

వైరస్ రూపం మారుతోంది

అతను హాస్పిటల్ లో చెరిన ప్రతిసారి ఇన్ఫెక్షన్ కు గురిచేసిన వైరస్ యొక్క క్రమాన్ని కనుగొన్నారు. ఈ నాలుగు నెలల్లో అతని శరీరంలో ఇన్ఫెక్షన్ కు కారణం అవుతున్న వైరస్ యొక్క రూపం మారుతూ వస్తోంది.

ఈ మార్పుల ఆధారంగానే ఒక వ్యక్తికి కోవిడ్ ఇన్ఫెక్షన్ ఒకసారి వచ్చిన తరువాత రెండోసారి కూడా సోకవచ్చు అన్న విషయాన్ని నిపుణులు ధృవీకరిస్తున్నారు.

ఈ కేసు ఆధారంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిపుణులు, ఇన్ఫెక్షియస్ డీసీజ్ ఎపిడమాలజిస్ట్,  మరియ వాన్ కేర్ఖోవ్ ఏమంటున్నారంటే ‘ఒక వ్యక్తికి కోవిడ్ ఒకసారి వచ్చిన తరువాత అతని శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతోందని’ చెబుతున్నారు.

హెర్డ్ ఇమ్యూనిటి, వ్యాక్సిన్ లకు ఆటంకం

అయితే రోగనిధకశక్తి ఎంత బలంగా వృద్ధి చెందుతోంది అది ఎంత కాలం ఉంటుంది అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. అయితే ఇది అటు హెర్డ్ ఇమ్యూనిటి వైపు, ఇటు వాక్సిన్ వైపు సాగే అభివృద్ధి పనులకు ఆటంకాలను కలిగిస్తోందని అంటున్నారు నిపుణులు.  

ఇటువంటి కేసులు అక్కడక్కడా కనపడతాయా లేక తరచూ కనిపిస్తాయా అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ విషయం గురించి ఇంకా అధ్యయనం చేసే వరకు పెద్దగా విచారించాల్సిన అవసరం లేదు.

ఒకసారి కరోనా సోకి చికిత్స తీసుకున్న తరువాత ఇన్ఫెక్షన్ మీద దాడి చేసే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

– పోలాండ్ నిపుణులు.

రెండోసారి వ్యాధి సోకితే తీవ్రత తక్కువే

తమకు రెండోసారి కోవిడ్ వ్యాధి సోకి వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టినట్టు సోషల్ మీడియాలో అక్కడక్కడా పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే సైంటిస్టులు మాత్రం రెండోసారి వ్యాధి సోకితే అది బాగా ఇబ్బందికి గురిచేసినట్లు ఆధారాలేవీ కనపడలేదు అంటున్నారు.

[wpdiscuz-feedback id=”tgt5hkebu2″ question=”Please leave a feedback on this” opened=”0″][/wpdiscuz-feedback]

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top