Book Doctor Appointments

Health Tips

బోన్ కాన్సర్...Bone Cancer




ఎముకలో ఏర్పడే ట్యూమర్లు చాలా సందర్భాల్లో కాన్సర్ ట్యూమర్లు కాకపోవచ్చు. ఎముకలో ఏర్పడిన కాన్సర్ ట్యూమర్లు రెండు రకాలుగా ఉంటాయి. వీటినే ప్రైమరీ ట్యూమర్లు, సెకండరీ ట్యూమర్లు అంటారు. ప్రైమరీ ట్యూమర్లను సర్కోమా అంటారు. సెకండరీ ట్యూమర్లు ఏర్పడటానికి ప్రత్యేకమైన కారనాలెవీ ఇప్పటివరకు కనుగొనలేకపోయారు. త్వరగా వ్యాప్తిచెందే కణాలతో ఏర్పడిన ట్యూమర్లు ఎముకలోని ఇతర ఆరోగ్య కణాలను ఆక్రమిస్తాయి. అందువలన ఎముకలు బలహీనపడి విరిగిపోడానికి కూడా కారణమవుతాయి. చాలా త్వరగా వ్యాప్తిచెందే ఈ కాన్సర్ కణాలను త్వరగా గుర్తించి చికిత్స తీసుకోకపోతే చాలా అనర్ధాలు జరుగుతాయి.

ఎముకలో ఏర్పడే ట్యూమర్లు నాలుగు రకాలుగా ఉంటాయి. ఆస్టియో సర్కోమా, ఏవింగ్స్ సర్కోమా ఇవి సాధారణంగా పిల్లల్లో కనిపించే ట్యూమర్లు. మల్టీపుల్ మైలోమా, కాండ్రో సర్కోమా 40 నుంచి 70 సంవత్సరాల వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. సాధారణంగా ఇతర శరీర భాగాల్లో కాన్సర్లు ఏర్పడినపుడు ప్రాథమిక దశలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. వాటిని గుర్తించేసరికే అవి పరిమాణంలో పెరిగిపోయి ఉంటాయి.

కానీ ఎముకలో ట్యూమర్ ఉన్నపుడు సాధారణంగా కనిపించే లక్షణాలు వాపు, నొప్పి, కాళ్ళు చేతులు కదల్చలేని పరిస్తితి ఏర్పడటం, చాలా తక్కువ సంధార్బాల్లో ఎముక విరిగడం ద్వారా ఎముకలో కాన్సర్ ను గుర్తించవచ్చు. ఎటువంటి నొప్పి లేకుండా ఏర్పడిన చిన్న కణితి పెరిగే కొద్ది దాని పరిధిలో ఉన్న నాడులు, కండరాల మీద ఒత్తిడి పెంచడం వల్ల నొప్పి వాపు వస్తాయి.  

Health Tips